: సాకర్ టీమ్ సొంతం చేసుకోవాలని షారుఖ్ ప్లాన్


బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఓ ఫుట్ బాల్ టీమ్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు. షారుఖ్ ఇప్పటికే ఐపీఎల్లో కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీని కలిగి ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఐపీఎల్ తరహాలో ఓ భారీ సాకర్ లీగ్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ లీగ్ లో తనకూ ఓ ఫ్రాంచైజీ కావాలంటున్నాడు షారుఖ్. ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ, 'ఫుట్ బాల్ లీగ్ లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాను. అది సాధ్యమైతే కోల్ కతా ఫ్రాంచైజీనే తీసుకుంటాను. పరిమిత వనరులే ఉన్నా, లీగ్ లో భాగస్వాములమయ్యేందుకు కృషి చేస్తున్నాం' అని ఈ వెటరన్ హీరో పేర్కొన్నాడు. ఇక ఈ వేసవిలో జరిగే ఐపీఎల్-7 కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు.

  • Loading...

More Telugu News