: గవర్నరుకు నిమ్స్ లో వైద్య పరీక్షలు
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈరోజు (శుక్రవారం) హైదరాబాదు పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆయన నిమ్స్ కి వచ్చారని తెలిసింది. నిమ్స్ లోని వైద్య విభాగాల అధిపతులు డాక్టర్ మన్మథరావు, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ బీరప్పలతో కూడిన వైద్య నిపుణుల బృందం నరసింహన్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.