: పిజ్జా రెస్టారెంట్ లో మేనేజర్ గలీజు పని


అత్యంత పరిశుభ్రత పాటించాల్సిన రెస్టారెంట్ లో.. బాధ్యతగా వ్యవహరించాల్సిన మేనేజరే తుంటరిపని చేశాడు. రెస్టారెంట్ లో కిచెన్ లో ఉన్న సింక్ లోనే మూత్రవిసర్జన కానిచ్చేశాడు. అదే సింక్ లో పాత్రలను కడుగుతుంటారు. అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రం చార్లెస్టన్ పట్టణానికి సమీపంలో పిజ్జా హట్ రెస్టారెంట్ లో ఇది జరిగింది. అతగాడి గలీజు పని సీసీటీవీ కెమెరాలో పడడం, అది బయటకు రావడంతో ఆరోగ్య ప్రమాణాల విభాగం అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. రెస్టారెంట్ ను సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News