: మేం మళ్లీ గెలుస్తాం: కాంగ్రెస్ నేత దానం నాగేందర్
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం పట్ల కాంగ్రెస్ నేత దానం నాగేందర్ సంతోషం వ్యక్తం చేశారు. కానీ, రక్షణ వ్యవస్థకు సంబంధించిన అధికారాలను గవర్నర్ కు అప్పగించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర విభజన చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలన్న ఆకాంక్ష సోనియాగాంధీ వల్లే నెరవేరిందని ఆయన అన్నారు. తెలంగాణ విభజన చేస్తే టీఆర్ఎస్ ను విలీనం చేస్తామన్న కేసీఆర్ వాగ్దానాన్ని ఆ పార్టీ నిలుపుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కలిసి రాకున్నా... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాదులో సీమాంధ్ర ప్రజలు నిర్భయంగా ఉండవచ్చని... వారికి రక్షణ కల్పించే బాధ్యత తమపై ఉందని దానం చెప్పారు.