: 'యంగిస్తాన్' సినిమాపై కోర్టుకెక్కిన పెప్సీ
బాలీవుడ్ తాజా చిత్రం 'యంగిస్తాన్' విడుదలను అడ్డుకోవాలంటూ బహుళజాతి శీతలపానీయాల సంస్థ పెప్సీకో కోర్టుకెక్కింది. 'యంగిస్తాన్' అనేది తమ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అని, దాన్ని చిత్ర నిర్మాతలు సినిమాకు ఉపయోగించుకుని, అదే పేరుతో ప్రచారం చేసుకోవడం చట్టాన్ని ఉల్లంఘించడమే అని పెప్సీకో పేర్కొంది. ఈ మేరకు సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 24కు వాయిదా వేసింది. కాగా, ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయాలని నిర్మాతలు ఇంతకుముందు ప్రకటించారు. జాకీ భగ్నానీ, నేహా శర్మ, ఫరూఖ్ షేక్, బొమన్ ఇరానీ తదితరులు నటించిన ఈ సినిమాకు సయ్యద్ అహ్మద్ అఫ్జల్ దర్శకుడు. రాజకీయాల నేపథ్యంలో వస్తున్న ఈ ప్రేమకథా చిత్రాన్ని ఎంఎస్ఎం మోషన్ పిక్చర్స్, పూజా ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించాయి.