: ముఖ్యమంత్రి ఎవరైనా అభ్యంతరం లేదు: గండ్ర
కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరిని ముఖ్యమంత్రిని చేసినా తమకు అభ్యంతరం లేదని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించరాదని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ రోజు ఆయన వరంగల్ లో మీడియాతో మాట్లాడారు. సోనియా దయవల్లే తెలంగాణ ప్రజల కల సాకారమయిందని అన్నారు. బీజేపీతో కలసి చంద్రబాబు చివరి వరకు తెలంగాణను ఆపడానికి ప్రయత్నించారని ఆరోపించారు.