: ఐపీఎల్-7 నిర్వహించకండి: కేంద్ర హోం మంత్రి షిండే


ఐపీఎల్... ప్రపంచ క్రికెట్ స్వరూపాన్నే మార్చేసిన టోర్నీ. క్రికెట్ లో కరెన్సీని ఎలా ప్రవహింపజేయవచ్చో తెలియజేసిన టోర్నీ. ఒక్క సీజన్ ఐపీఎల్ లో ఆడితే చాలు, ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని ప్రతి దేశ క్రికెటర్ కోరుకునే టోర్నీ. ఇక క్రికెట్ అభిమానుల విషయానికొస్తే, ఐపీఎల్ జరుగుతున్నంత కాలం, పండగే. పూర్తి ఎంటర్ టైన్ మెంటే. ఐపీఎల్ దెబ్బకు టాప్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ డేట్లు మార్చుకోవాల్సిందే. ఇంత క్రేజ్ ఉన్న ఐపీఎల్ 7వ సీజన్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆటగాళ్ల వేలంపాట కూడా పూర్తయింది.

ఈ పరిస్థితుల్లో ఐపీఎల్-7 కు కేంద్ర హోంశాఖ మోకాలడ్డుతోంది. టోర్నమెంటును వాయిదా వేసుకోవాలని సూచిస్తోంది. ఐపీఎల్ జరిగే సమయంలో ఎన్నికలు జరగబోతున్నాయని, ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణ కష్టసాధ్యమని కేంద్ర హోంమంత్రి షిండే అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో ఐపీఎల్ కు భద్రత కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీంతో, ఐపీఎల్-7 నిర్వహణపై కారుమబ్బులు కమ్ముకున్నాయి.

  • Loading...

More Telugu News