: ఆసియాకప్ జట్టుకు కోహ్లీ సారధ్యం


బంగ్లాదేశ్ లో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టుకు విరాట్ కోహ్లీ సారధ్యం వహించబోతున్నాడు. ఎడమవైపు డొక్కలో గాయం కారణంగా ధోనీకి విశ్రాంతి ఇవ్వనున్నారు. న్యూజిలాండ్ తో రెండో టెస్టు మ్యాచులో ధోనీకి గాయం అయినందువల్ల 10 రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని బీసీసీఐ ప్రకటన జారీ చేసింది. దినేశ్ కార్తీక్ వికెట్ కీపర్ గా ఆసియాకప్ లో ధోనీ స్థానంలో ఆడనున్నాడు. 25 నుంచి మార్చి 8 వరకు జరిగే ఆసియాకప్ లో పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా ఆడనున్నాయి. ఆఫ్గనిస్థాన్ తొలిసారిగా ఆరంగేట్రం చేయబోతోంది. భారత జట్టు తొలిగా ఈ నెల 28న శ్రీలంకతో తలపడుతుంది.

  • Loading...

More Telugu News