: ప్రత్యేక హోదా అంటే ...!
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై నిన్న చర్చ జరిగిన నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ సీమాంధ్ర ప్రాంతానికి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్టు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక వనరుల కోణంలోనే ఈ ప్రత్యేక హోదా ఇస్తారు. ఈ ప్రత్యేక హోదాతో చేకూరే ప్రయోజనాలు ఇవే...
* కేంద్ర ప్రభుత్వ వనరుల కేటాయింపులో అత్యధిక వాటా.
* పరిశ్రమలు, ఉత్పాదక సంస్థలను తరలించేందుకు, తిరిగి ఏర్పరచేందుకు చెప్పుకోదగిన రీతిలో ఎక్సైజ్ సుంకం మినహాయింపు.
* కేంద్రం ప్రణాళికా వ్యయానికి అందించే స్థూల బడ్జెటరీ మద్దతులో 30శాతం లభ్యత.
* ప్రణాళికా సాయంలో 90 శాతం మేర గ్రాంట్ల రూపంలోనూ, మిగతా 10 శాతం రుణాల రూపేణ సమకూర్చడం.
* ప్రత్యేక హోదాకు నిర్దిష్ట కాలపరిమితి ప్రకటించినా, ఈ హోదా ఇంకా అవసరమని కేంద్రం భావిస్తే పొడిగించే అవకాశం.