: రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటే మంచిది: కేంద్ర హోంశాఖ
రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడనున్న తరుణంలో కాంగ్రెస్ హైకమాండ్ ఇరు రాష్ట్రాలపై దృష్టి సారించింది. రెండు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులను నియమించాలా? లేక రాష్ట్రపతి పాలన విధించాలా? అనే విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. అయితే, తాత్కాలికంగా రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తేనే మంచిదని కేంద్ర హోంశాఖ సూచించినట్టు తెలుస్తోంది. కిరణ్ రాజీనామా అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర వ్యవహారాలపై తర్జన భర్జన పడుతోంది. ఏదేమైనప్పటికీ, ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో తన బలాబలాలను అంచనా వేసే పనిలో అధిష్ఠానం ఉందని తెలుస్తోంది.