: నిన్న రాజ్యసభలో ప్రధాని ఆంధ్రకు ప్రకటించిన ఆరు సూత్రాల ప్యాకేజీ వివరాలు
నిన్న రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆంధ్రకు ప్రకటించిన ఆరు సూత్రాల ప్యాకేజీ లోని వివరాలు ఇవే...
* 13 జిల్లాలతో కూడిన విభజనానంతర ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించడం.
* రెండు రాష్ట్రాల్లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు, ఆర్ధిక వృద్ధి కోసం పన్ను ప్రోత్సాహకాలు కల్పించడం.
* ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బిల్లులో ఇప్పటికే కల్పించిన ప్రత్యేక ప్యాకేజీని ఒడిశాలోని కె -బి -కె ప్రత్యేక ప్రణాళిక, యూపీ, మధ్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రత్యేక ప్యాకేజీ తరహాలో అమలు చేయడం.
* పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వమే చేపట్టడం.
* సిబ్బంది, ఆర్ధిక వ్యవహారాలు, ఆస్తులు, బకాయిల పంపిణీ వంటి వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయటానికి 'నోటిఫైడ్' తేదీని దృష్టిలో ఉంచుకుని కొత్త రాష్ట్ర అవతరణకు 'అపాయింటెడ్ డే' ను నిర్ణయించడం.
* విభజనానంతర ఆంధ్రప్రదేశ్ లో తొలి ఏడాదిలో తలెత్తే వనరుల కొరతను 2014-15 కేంద్ర బడ్జెట్ లో భర్తీ చేయడం.