: ‘జై తెలంగాణ’ అంటూ నినదించిన కేసీఆర్
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపడంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఆనందం వ్యక్తం చేశారు. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కావాలన్న తెలంగాణ బిడ్డల ఆశయం నెరవేరిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన, తెలంగాణ అమరవీరులను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వార్త విన్న వెంటనే కేసీఆర్ ఢిల్లీలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ ఎంపీలు, పార్టీ ఎమ్మెల్యేలతో కలసి వచ్చి తెలంగాణ వాదులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలతో కలిసి ఆయన ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. ‘జై తెలంగాణ’ అంటూ కేసీఆర్ నినదించారు.