: సీమాంధ్రకు ఎలాంటి నష్టం వాటిల్లదు: జైపాల్ రెడ్డి
సీమాంధ్రకు సాధ్యమైనంత ఎక్కువ న్యాయం జరుగుతుందని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. ఈరోజు (గురువారం) రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన అనంతరం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ బిల్లు వలన సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లదని జైపాల్ రెడ్డి చెప్పారు.