: రెండు రాష్ట్రాలుగా విడిపోయినా.. సోదరులుగా కలిసుందాం: కోదండరామ్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ప్రాంతాలుగా విడిపోయినా... అన్నదమ్ముల్లా కలిసుందామని తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. తమ పోరాటం సీమాంధ్ర పాలకులపైనని, సీమాంధ్రులపై కాదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సహకరించిన రాంవిలాస్ పాశ్వాన్, అజిత్ సింగ్, మాయావతి తదితరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కావాలన్న ఆకాంక్ష నెరవేరిందని, ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర వికాసం కోసం పనిచేస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News