: సీమాంధ్రకు రెవెన్యూ లోటు.. జీతాలివ్వడం కూడా కష్టమే: వెంకయ్య నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో బీజేపీ ఎంపీ వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలను సభ మూజువాణి ఓటుతో తిరస్కరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రకు రెవెన్యూ లోటు ఉందని, కేంద్ర బడ్జెట్ కేటాయింపులు లేకపోతే అక్కడ జీతాలివ్వడం కూడా కష్టమేనని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడుకు... కేంద్ర మంత్రులు షిండే, జైరాం రమేష్ లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మధ్యంతర బడ్జెట్ పూర్తయినందున వెంకయ్య సూచించిన సవరణలు ఇప్పుడు చేర్చడం కుదరదని జైరాం రమేష్ బదులిచ్చారు. రెండు నెలల తర్వాతి బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని ఆయన తెలిపారు.