: వీరూకి అరుదైన గౌరవం


దాదాపు అందరూ మర్చిపోయే దశకు చేరుకున్న తరుణంలో వీరేంద్ర సెహ్వాగ్ కు అరుదైన గౌరవం లభించనుంది. అబుదాబిలో జరిగే నాలుగు రోజుల క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనే ప్రతిష్ఠాత్మక మెర్లిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) జట్టుకు కెప్టెన్ గా సెహ్వాగ్ ను ఎంపిక చేశారు. మార్చి 23న ఆరంభమయ్యే ఈ మ్యాచ్ లో ఎంసీసీ, ఇంగ్లిష్ కౌంటీ జట్టు డుర్హం తలపడతాయి. అనంతరం జరిగే ఎమిరేట్స్ టి20 టోర్నీలో పాల్గొనే ఎంసీసీ జట్టుకు లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ నాయకత్వం వహిస్తాడు. ఈ మేరకు ఎంసీసీ నేడు లండన్ లో ఓ ప్రకటన చేసింది.

కాగా, ఎంసీసీ జట్టుకు ఇంగ్లండ్ ఆటగాడు మాంటీ పనేసర్, శ్రీలంక వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్ ప్రసన్న జయవర్థనే కూడా ప్రాతినిధ్యం వహించనున్నారు. కాగా, డుర్హంతో ఎంసీసీ జట్టు ఆడే నాలుగు రోజుల మ్యాచ్ లో గులాబీ రంగు బంతిని ఉపయోగించనున్నారు. డే/నైట్ విధానంలో ఈ మ్యాచ్ ను నిర్వహిస్తారు. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ నేపథ్యంలో ఈ మ్యాచ్ లు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News