: యువతిని కాల్చి చంపిన ఎస్సై


మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. గ్వాలియర్ జిల్లా చతార్ పూర్ లో ఓ సబ్ ఇన్ స్పెక్టర్ తన ప్రేమను కాదన్నందుకు ఓ యువతిని కాల్చిచంపాడు. రవీంద్ర సింగ్ బుండేలా (30) అనే యువకుడు ఇందర్ గఢ్ పోలీస్ స్టేషన్లో హౌస్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. న్యాయవాద విద్యను అభ్యసిస్తున్న తన బంధువుల అమ్మాయికి ఇంతకుముందోసారి లవ్ ప్రపోజ్ చేశాడు. తాజాగా, మరోసారి తన ప్రేమను తెలపగా, ఆమె తిరస్కరించింది. కోపోద్రిక్తుడైన ఆ యువ ఎస్సై సర్వీస్ రివాల్వర్ తీసి పాయింట్ బ్లాంక్ రేంజిలో తలకు గురిపెట్టి కాల్చాడు. దీంతో, ఆ యువతి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఆ కిరాతక ఎస్సైని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News