: ఈ బిల్లు తప్పుల తడక: నరేష్ గుజ్రాల్
ఓటు బ్యాంకు రాజకీయాలతోనే విభజన నిర్ణయం తీసుకున్నారని శిరోమణి అకాలీ దళ్ సభ్యుడు నరేశ్ గుజ్రాల్ అన్నారు. ఈరోజు (గురువారం) రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో అనేక తప్పులు దొర్లాయని, ఈ బిల్లు తప్పుల తడక అని గుజ్రాల్ పేర్కొన్నారు. దీనిపై అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని ఆయన సూచించారు.