: విభజన బిల్లు రాజ్యాంగ విరుద్ధం... బిల్లును వ్యతిరేకిస్తున్నాం: ఏజీపీ సభ్యుడు బీరేంద్ర ప్రసాద్ బైష్యా


అసోం రాష్ట్రానికి చెందిన అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) సభ్యుడు బీరేంద్ర ప్రసాద్ బైష్యా రాజ్యసభలో ఆవేశపూరితంగా ప్రసంగించారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు బీరేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని... ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీనే ఆమోదించలేదని ఆయన అన్నారు. రాజ్యాంగ వ్యతిరేక బిల్లును పక్కన పెట్టాలని ఆయన తేల్చి చెప్పారు. సమాఖ్య వ్యవస్థకు నష్టం కలిగించేలా కేంద్రం వ్యవహరించకూడదని బీరేంద్ర ప్రసాద్ తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News