: విభజన బిల్లుకు సంపూర్ణ మద్దతు: టీడీపీ ఎంపీ గుండు సుధారాణి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టీడీపీ సభ్యురాలు గుండు సుధారాణి రాజ్యసభలో ప్రసంగించారు. తాను తెలంగాణ బిడ్డనంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన గుండు సుధారాణి... విభజన బిల్లుకు తాను సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు చెప్పారు. విభజన బిల్లు తెచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం ఎక్కడి ఉద్యోగులు అక్కడే ఉండాలనే క్లాజు సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. అవసరమైతే ప్రత్యేక ఉద్యోగాలు సృష్టించి అయినా... ఉద్యోగులను బదలాయించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేసేందుకు స్థానికత ఆధారంగా ఫించన్లు ఇవ్వాలని ఆమె కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరవధిక నిరాహార దీక్ష చేసి, తాను జైలుకెళ్లిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. గుండు సుధారాణి తన ప్రసంగాన్ని ‘జై తెలంగాణ’ అంటూ ముగించారు.