: నడుంనొప్పితో కుప్ప కూలిన కేవీపీ
ఎంపీ కేవీపీ రామచంద్రరావు నడుం నొప్పితో రాజ్యసభలో కుప్పకూలిపోయారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ఛైర్మన్ పోడియంలో ప్లకార్డును పట్టుకుని, నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆయన పోడియంలో కూలిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ ఆదేశించారు. అయితే, అందుకు నిరాకరించిన కేవీపీ అక్కడే నేలపై కూర్చొని నిరసన తెలుపుతున్నారు.