: ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని పట్టించుకోనందుకు డీఎంకే వాకౌట్
అసెంబ్లీ నిర్ణయాన్ని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో ముందుకు వెళ్లడాన్ని డీఎంకే ఖండిస్తోందని ఆ పార్టీ ఎంపీ కనిమోళి (కరుణానిధి కుమార్తె) స్పష్టం చేశారు. ఈ విధంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని చెప్పారు. విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తాము వాకౌట్ చేస్తున్నామని చెప్పారు. అనంతరం డీఎంకే సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.