: హైదరాబాదును యూటీ చేయాలి: చిరంజీవి
హైదరాబాదు అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర ఎంతో ఉందని రాజ్యసభలో ప్రసంగిస్తూ చిరంజీవి అన్నారు. అందువల్ల హైదరాబాదుని యూటీ చేయాలని కోరారు. తాను వ్యక్తిగతంగా విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చిరంజీవి తెలిపారు. దీనికి అరుణ్ జైట్లీ అడ్డుతగులుతూ, ఆయన ప్రభుత్వంలోని మంత్రిగా మాట్లాడుతున్నారా? లేక సభ్యుడిగా మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. దీనికి చిరంజీవి బదులిస్తూ తాను ప్రజల తరపున మాట్లాడుతున్నానని చెప్పారు.