: చిరంజీవిపైకి దూసుకెళ్లిన సీఎం రమేష్
రాజ్యసభలో చర్చ సందర్భంగా మాట్లాడుతున్న కేంద్రమంత్రి చిరంజీవిపైకి దూసుకెళ్లేందుకు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ యత్నించారు. సమన్యాయమంటే ఏమిటని టీడీపీ అధినేత చంద్రబాబును సభలో ప్రశ్నించడంపై మండిపడ్డ రమేష్ చిరు చేతిలో పేపర్ లాక్కుని, అతని ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వేరే సభ్యుడొకరు వచ్చి రమేష్ ను సముదాయించారు.