: తాలిబాన్లకు చుక్కలు చూపించారు!


గత కొన్నేళ్ళుగా దేశంలో ఏర్పడిన అస్థిరతను అవకాశంగా తీసుకుని రెచ్చిపోతున్న తాలిబాన్లకు పాకిస్తాన్ ఫైటర్ జెట్లు నేడు చుక్కలు చూపాయి. ఉత్తర వజీరిస్తాన్, ఖైబర్ ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న తాలిబాన్ స్థావరాలపై పెద్ద ఎత్తున వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 40 మంది మిలిటెంట్లు హతమయ్యారు. తాలిబాన్లతో చర్చలుండవని నవాజ్ షరీఫ్ సర్కారు ప్రకటించిన కొద్ది రోజులకే ఈ దాడులు జరిగాయి. ఇటీవలే పెషావర్లోని ఓ సినిమా హాల్లో పేలుళ్ళకు పాల్పడిన తాలిబాన్లు 13 మందిని పొట్టనబెట్టుకున్నారు. దీంతో, తాలిబాన్ల అరాచకంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

  • Loading...

More Telugu News