: వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభం


పదిహేను నిమిషాల వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభమైంది. అంతకుముందు సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు, అదే క్రమంలో ప్రసంగం కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని చెప్పిన ఆయన భద్రత, ఉపాధి, విద్య సహా పలు అంశాల్లో సీమాంధ్రుల్లో ఆందోళన ఉందని చెప్పారు. అయితే, బిల్లు రాజ్యాంగ బద్ధమా? కాదా? అని అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవడంలో తప్పులేదన్నారు. మరోవైపు వెల్ లో సీమాంధ్ర ఎంపీల సహ ఇతర సభ్యుల నినాదాలు, నిరసనల మధ్యే వెంకయ్య తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News