: జూనియర్ ఎన్టీఆర్ తో విభేదాలు లేవు: బాలకృష్ణ
జూనియర్ ఎన్టీఆర్ తో విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలపై బాలకృష్ణ స్పందించారు. తమకు, ఎన్టీఆర్ కు మధ్య అలాంటివేవీ లేవని విశాఖలో ఆయన స్పష్టం చేశారు. పాయకరావు పేటలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం తాను వచ్చినట్లు బాలయ్య చెప్పారు. కాగా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేబట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర ముగింపు ఎక్కడ ఉంటుందో తనకు తెలియదన్నారు.