: వెంకయ్యనాయుడుని ఇరుకున పెట్టేందుకు యత్నించిన కురియన్
రాజ్యసభలో కురియన్ తన తెలివితేటలను ప్రదర్శించారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే నినాదాలతో హోరెత్తింది. ఈ పరిస్థితుల్లో మాట్లాడిన వెంకయ్యనాయుడు, ప్రస్తుతం చర్చించాల్సిన బిల్లు అత్యంత కీలకమైనదని, రెండు ప్రాంతాల ప్రజలకు సంబంధించినదని, ఈ అంశంకోసం వందలాది మంది ప్రాణాలను త్యాగం చేశారని చెప్పారు. కాబట్టి సభను ఆర్డర్ లో ఉంచాలని కురియన్ ను కోరారు. దీనికి స్పందిస్తూ కురియన్ మీరు (బీజేపీ) సహకరిస్తే ఆర్డర్లో పెడతానని బదులిచ్చారు. ఆందోళన చేస్తున్న సభ్యులను సస్పెండ్ చేయడానికి సహకరిస్తారా? అని ప్రశ్నించారు. ఇప్పటికే సస్పెండ్ చేస్తానని సుజనా చౌదరికి కురియన్ వార్నింగ్ కూడా ఇచ్చారు.