: ఇప్పటికి 10 సార్లు వాయిదా పడ్డ రాజ్యసభ


ఈ రోజు రాజ్యసభ కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటికి పది సార్లు వాయిదా పడింది. సభ ప్రారంభం అయింది అనుకునేంతలోనే అనేక సార్లు వాయిదా పడింది. సభ్యులు పూర్తిగా తమ సీట్లలో ఆసీనులు కాకుండానే వాయిదా పడుతూ వచ్చింది. కేంద్ర మంత్రులు, సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్ సభలో ఉన్న సమయంలో కూడా సభ ఏ క్షణంలోనూ సజావుగా కొనసాగలేదు. సీమాంధ్ర ఎంపీలతో పాటు, సీపీఎం, సమాజ్ వాది, తృణమూల్, శివసేన ఎంపీలు కూడా విభజనకు వ్యతిరేకంగా సభను హోరెత్తిస్తున్నారు.

  • Loading...

More Telugu News