: ఇటలీ నావికులు భారత్ కు పయనమయ్యారు: ఖుర్షీద్
వివాదాస్పద ఇటలీ నావికులు ఇద్దరూ తిరిగి భారత్ కు వచ్చేందుకు పయనమయ్యారని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈరోజు లోక్ సభకు తెలిపారు. సుప్రీంకోర్టు విధించిన గడువులోపు నావికులు తిరిగి దేశానికి వస్తే అరెస్టు చేయబోమని ఇటలీకి తెలిపినట్లు మంత్రి వెల్లడించారు.
కేరళ జాలర్ల హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నఇద్దరు నావికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుప్రీం అనుమతితో స్వదేశానికి వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ భారత్ కు వచ్చేదిలేదని చెప్పడంతో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.