: తెలంగాణ ఏర్పాటు..సీమాంధ్రకు న్యాయం రెండూ సంభవమే: జవదేకర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సీమాంధ్రకు న్యాయం చేయడం రెండూ సాధ్యమేనని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ బీజేపీ తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారని... కానీ అది అవాస్తవమని, తాము తెలంగాణ బిల్లుకు మద్దతిస్తున్నామని అన్నారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లులోని రాజ్యాంగ అంశాలపైనే అరుణ్ జైట్లీ చర్చిస్తారని ఆయన స్పష్టం చేశారు. తాము రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు.