: సీమాంధ్రకు న్యాయం చేయాల్సిందే: ప్రకాశ్ జవదేకర్


పలుమార్లు రాజ్యసభ వాయిదా పడుతున్న అనంతరం బీజేపీ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు ఏర్పాటు చేయాల్సిందేనని... అయితే, అదే సమయంలో సీమాంధ్రకు కూడా న్యాయం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, బిల్లులో రాజ్యాంగ బద్దమైన అంశాల గురించే అరుణ్ జైట్లీ నోటీసు ఇచ్చినట్లు జవదేకర్ చెప్పారు. తాము సూచించిన సవరణలను ప్రభుత్వం ఆమోదిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News