: 'కోట్లా'టలో ఆసీస్ విలవిల


ఆఖరి టెస్టులోనూ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ తీరు మారలేదు. విజయంతో స్వదేశం తిరిగివెళదామనుకున్న కంగారూల ఆశలకు తొలిరోజే గండి పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ను భారత బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో 152 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 3, ఇషాంత్ 2, జడేజా 2 వికెట్లు తీశారు. ప్రస్తుతం క్రీజులో స్మిత్ (24 బ్యాటింగ్), సిడిల్ (5 బ్యాటింగ్) ఉన్నారు. రెగ్యులర్ కెప్టెన్ క్లార్క్ గైర్హాజరీలో వాట్సన్ ఈ మ్యాచ్ లో ఆసీస్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. 

  • Loading...

More Telugu News