: భారత్ చేరుకున్న హీ(జీ)రోలు


దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పర్యటనల్లో ఒక్క విజయాన్నీ దక్కించుకోలేని టీమిండియా భారత్ చేరుకుంది. రిక్తహస్తాలతో సొంతగడ్డపై అడుగుపెట్టిన ధోనీ గ్యాంగ్ మీడియాతో మాట్లాడకుండానే ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు. గతరాత్రి బాగా పొద్దుపోయాక ముంబయి చేరుకున్న జట్టు సభ్యులు అటునుంచి అటే తమతమ స్వస్థలాలకు పయనమయ్యారు. కివీస్ పర్యటనలో భారత్ వన్డే సిరీస్ ను 0-4తో, టెస్టు సిరీస్ ను 0-1తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు సఫారీ టూర్లో వన్డే సిరీస్ ను 0-2తో, టెస్టు సిరీస్ ను 0-1తో సమర్పించుకుంది. కాగా, ఆసియా కప్ లో పాల్గొనేందుకు భారత జట్టు ఈ నెల 23న బంగ్లాదేశ్ పయనం కానుంది.

  • Loading...

More Telugu News