: బీజేపీ డ్రామాలు కట్టిపెట్టాలి: హర్హకుమార్


లోక్ సభలో టీ-బిల్లు ఆమోదం పొందడానికి సహకరించిన బీజేపీ... మరోసారి నయవంచనకు తయారవుతోందని సీమాంధ్ర ఎంపీ హర్షకుమార్ అన్నారు. బిల్లులో సవరణలు చేయాలంటూ, కాంగ్రెస్ తో మీటింగులు పెట్టుకుంటూ, సీమాంధ్రులను మరోసారి మోసం చేయబోతోందని ఆయన తెలిపారు. ఇకపై డ్రామాలు కట్టిపెట్టి... బిల్లు సవరణలపై రాజ్యసభలో బీజేపీ ఓటింగ్ కు పట్టుబట్టాలని ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. సీమాంధ్రుల ఉసురు పోసుకోవద్దంటూ కోరారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలని ఆయన అన్నారు. గాలి జనార్ధన్ రెడ్డికి బెయిలు ఏ విధంగా వచ్చిందో బయటపెట్టాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News