: ఎక్కువమంది అమెరికన్ల అభిప్రాయం అదేనట!


వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై 2001, సెప్టెంబర్ 11 దాడుల అనంతరం అమెరికా అల్ ఖైదాపై దాడి పేరిట ఆఫ్ఘనిస్తాన్ లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆఫ్ఘన్ గడ్డపై వివిధ శక్తులతో జరగిన పోరులో అమెరికా సైనికులు పెద్ద ఎత్తున చనిపోయారు. అంతేగాకుండా, వేల కోట్ల డాలర్ల వ్యయం అమెరికా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. దీనిపై తాజాగా అమెరికాలో ఒపీనియన్ పోల్ నిర్వహించారు. 49 శాతం మంది ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సేనలు ప్రవేశించడం పెను తప్పిదమని పేర్కొన్నారట. 48 శాతం సమర్థించగా, మిగిలిన వాళ్ళు తటస్థంగా ఉన్నారు. కాగా, ఈ ఏడాది చివరినాటికి ఆఫ్ఘన్ నుంచి అమెరికా సేనలను వెనక్కి పిలిపించాలని ఒబామా సర్కారు నిర్ణయించింది.

  • Loading...

More Telugu News