: రాజ్యసభ అరగంటపాటు వాయిదా
రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. తమిళ జాలర్ల గురించి తమిళ ఎంపీలు, సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఎంపీలు, తెలంగాణ బిల్లు ఎక్కడంటూ బీజేపీ ఎంపీలు సభలో ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో, సభను మరో అరగంట పాటు వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు.