: వెనుకబడిన ప్రాంతాలకిచ్చే ప్యాకేజీని సీమాంధ్రకు ఇస్తామన్నారు: బీజేపీ నేత హరిబాబు
రాజ్యసభలో టీబిల్లుకు ఆమోద ముద్ర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేత హరిబాబు మాట్లాడిన తీరు చూస్తుంటే, బిల్లు ఆమోదానికి బీజేపీ మద్దతు తెలిపేలా ఉంది. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ నేతలతో ప్రధాని చర్చించిన సమయంలో... సీమాంధ్రకు ఒడిశాలాంటి వెనుకబడిన ప్రాంతానికి ఇచ్చే ప్యాకేజీను ఇస్తామన్నారని చెప్పారు. పోలవరం నిర్మాణానికి భవిష్యత్తులో ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు... ప్రాజెక్టుకు అవసరమైనంత ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపాలని నిర్ణయించారని తెలిపారు. సీమాంధ్ర అభివృద్ధికి ఎంత లోటు ఉంటే అంత లోటును (10 లేదా 12 వేల కోట్లు) ఇవ్వడానికి కేంద్ర సిద్ధమని చెప్పిందన్నారు. రాజ్యసభలో ప్రవేశపెట్టే బిల్లులో మార్పులు చేర్పులు చేస్తే, లోక్ సభలో మళ్లీ చర్చించడానికి సమయం సరిపోదని అన్నారని... సభలో ప్రధానమంత్రి ప్రకటన చేస్తారని, మంత్రి వర్గం దాన్ని ఆమోదిస్తుందని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో, టీబిల్లుకు బీజేపీ పూర్తి సహకారం అందించే వాతావరణం కనపడుతోంది.