: కపిలేశ్వర ఆలయంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహిస్తోంది. దీంతో కపిలేశ్వర ఆలయం మహాశివరాత్రి శోభను సంతరించుకుంది. బ్రహ్మోత్సవాలకు ప్రారంభ సూచికగా.. ఈ రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని కపిలేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ధ్వజపటాన్నిఎగురవేసి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. కపిలేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటో తేదీ వరకు కొనసాగుతాయి.