: ఎమర్జెన్సీలో ఉన్నామా?.. కాంగ్రెస్ మోసం చేసింది: కృష్ణం రాజు
ఎమర్జెన్సీ రోజులను తలపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదింపజేయాల్సిన అవసరం ఏంటో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత కృష్ణం రాజు ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలనే కాకుండా దేశం మొత్తాన్ని మోసం చేసిందని అన్నారు. ఒకరికి న్యాయం చేస్తున్నామని చెప్పి, మరో ప్రాంతానికి అన్యాయం చేయడం ఎంత సమర్థనీయమని ఆయన ప్రశ్నించారు. బీజేపీ రాజ్యసభలో అడ్డుకుంటుందని, సీమాంధ్రుల తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉందని, ఆరు అంశాల్లో న్యాయం చేసేవరకు బీజేపీ అగ్రనాయకత్వం విశ్రాంతి తీసుకోదని ఆయన తెలిపారు.