: ఏప్రిల్ 22 వరకు లోక్ సభ వాయిదా
లోక్ సభ తొలిదశ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. దీంతో స్పీకర్ మీరాకుమార్ సభను ఏప్రిల్ 22 వరకు వాయిదా వేశారు. అయితే పింఛన్లు, ఇన్సూరెన్స్, ఆహార భద్రతా బిల్లు పెండింగులో ఉన్నాయి. అంతకుముందు శ్రీలంక తమిళుల అంశం, ఇతర అంశాలపై సభలో విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగింది. కాగా, రాజ్యసభ మధ్యాహ్నం 2.30 వరకు వాయిదా పడింది.