: ఆ ముగ్గురూ 'సన్స్ ఆఫ్ పిగ్స్' అంటున్న పీసీబీ మాజీ చైర్మన్


పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ ఇజాజ్ బట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులను ఉద్దేశించి 'సన్స్ ఆఫ్ పిగ్స్' అని వ్యాఖ్యానించారు. ఐసీసీ పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనపై స్పందించమని మీడియా కోరగా బట్ ఇలా నోరు పారేసుకున్నారు. బట్ తీరుతో పాక్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ చైర్మన్ వ్యాఖ్యలతో్ తమకు సంబంధంలేదని స్పష్టం చేసింది. అది బట్ వ్యక్తిగత అభిప్రాయమని ఐసీసీకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఐసీసీ నూతన ప్రతిపాదనల ప్రకారం.. భారత్, ఆసీస్, ఇంగ్లండ్ బోర్డులు ప్రపంచ క్రికెట్ ఆదాయంలో అధిక వాటా పొందుతాయి. కాగా, బట్ 2008-11 మధ్య కాలంలో పీసీబీ చైర్మన్ గా వ్యవహరించారు. బట్ హయాంలోనే లాహోర్ లో శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై తీవ్రవాదులు దాడి చేశారు.

  • Loading...

More Telugu News