: 'ఆయనే నా ఫేవరేట్ హీరో' అంటున్న అలనాటి అందాల నటి
ఆంధ్రాకు రాగానే నాగేశ్వరరావు గుర్తుకొచ్చారని... ఆయనే నా ఫేవరేట్ హీరో అని అలనాటి అందాల నటి సరోజాదేవి అన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు ఆమె నిన్న తిరుమల వచ్చారు. ఈ సందర్భంగా అక్కినేనితో తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 'అక్కినేనే నా ఫేవరేట్ హీరో' అని ఆమె చెప్పారు. 'హాయ్, హీరోయిన్ ఎలా ఉన్నావ్?' అనేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. 'ఆత్మబలం'లోని 'చిటపట చినుకులు' పాటను ఎన్నటికీ మరువలేనని అన్నారు. ఎన్టీఆర్ కూడా తనను ఎంతో ప్రోత్సహించారని వెల్లడించారు. తనతో పాటు నటించిన నటీనటులను మిస్సయ్యాననే ఫీలింగ్ కలుగుతుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.