: మహిళా ట్రాఫిక్ పోలీసుపై ఆటోవాలా అరాచకం


కొందరు ఆటో వాలాల దురుసుతనం తెలిసిందే. మహారాష్ట్రలోని కాల్వా పట్టణంలో ఓ ఆటోవాలా ఏకంగా మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ తోనే అసభ్యంగా ప్రవర్తించాడు. మహ్మద్ రషీద్ ఖాన్ అనే ఈ ఆటో డ్రైవర్ సతారా బ్యాంకు రహదారిపై వేగంగా వెళుతుండగా, బాధిత మహిళా పోలీసు అతడిని నిలువరించింది. లైసెన్స్ అడగడంతో ఖాన్ కు చిర్రెత్తుకొచ్చింది. దుర్భాషలాడుతూ, ఆమెపై చేతులేసి అసభ్యంగా ప్రవర్తించసాగాడు. దీంతో, ఠారెత్తిపోయిన ఆ కానిస్టేబుల్ సమీపంలో ఉన్న మరో కానిస్టేబుల్ ను పిలిచి విషయం వివరించింది. ఇద్దరూ కలిసి ఖాన్ ను లాక్కెళ్లి కాల్వా పోలీస్ స్టేషన్ లో పడేశారు. పోలీసులు అతడిపై లైంగిక వేధింపుల చట్టం కింద, మోటారు వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News