: రాజ్యసభ మరోసారి వాయిదా
రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. సేవ్ ఆంధ్రప్రదేశ్, 'ప్రజాస్వామ్యాన్ని కాపాడండి' అంటూ సీమాంధ్ర ఎంపీలు నినాదాలతో రాజ్యసభను హోరెత్తించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో అరగంట వాయిదా వేస్తూ ఉపసభాపతి కురియన్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ 12:30 గంటలకు తిరిగి సమావేశం కానుంది.