: మృగాళ్లతో జత కలసిన కన్నతండ్రి!
దేశ రాజధానికి సమీపంలో ఉంటుంది.. హర్యానాలోని సోనేపట్. ఆ గ్రామానికి చెందిన ఓ పాఠశాల బాలికకు చక్కగా చదువుకుని మంచి పొజిషన్ కు చేరుకోవాలనే ఆశ. కానీ, కామంతో కళ్లు మూసుకుపోయిన రాక్షసమూకలు ఆమెకు అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. గతేడాది ఓ రోజు కొంతమంది యువకులు ఆ బాలికపై అత్యాచారం చేశారు. నెల తిరిగేలోపే మరోసారి మృగాళ్లు కాటేశారు. బాధలో బిడ్డను ఓదార్చి కొండంత ధైర్యాన్ని ఇవ్వాల్సిన కన్నతండ్రికీ బుద్ధి గడ్డి తిన్నది. అతడూ ఆమెపై కన్నేశాడు.
'నా తండ్రి గతేడాది సెప్టెంబర్ లో నాపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానన్నాడు. నేను చదువుకోవాలని ఆశ పడ్డా. కానీ నా తండ్రి నన్ను వ్యభిచారంలోకి దింపాలని చూస్తున్నాడు' అంటూ తన బాధను మీడియాకు చెప్పుకుంది. ఒక స్వచ్చంద సంస్థ సాయంతో తన తండ్రిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిని కఠినంగా శిక్షించి, తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఆమె తల్లి కూడా ఇదే డిమాండ్ చేస్తోంది.