: బీజేపీ అగ్రనేతలతో కేంద్ర మంత్రుల భేటీ


బీజేపీ అగ్రనేతలతో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్, కమల్ నాథ్ భేటీ అయ్యారు. లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీల కార్యాచరణను బీజేపీ అగ్రనేతలకు వివరిస్తున్నారు. రాజ్యసభలో సవరణలు ప్రతిపాదిస్తామని బీజేపీ చెబుతుండడంతో, ప్రకటనతో సరిపెడతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సభలో ప్రకటనలకు చట్టబద్ధత ఉంటుందా? లేకుంటే సభ హామీలు నీటిలో పద్దులేనా? అనే విషయాన్ని బీజేపీ నిర్ణయించాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘ చర్చల తరువాత లోక్ సభలో బీజేపీ సూచించిన ఒక్క సవరణనూ చేపట్టని సంగతి తెలిసిందే. మరోసారి అదే ఘటన పునరావృతమవుతుందా అనే అనుమానం అందర్లోనూ రేకెత్తుతోంది.

  • Loading...

More Telugu News