: 2014 లోక్ సభ ఎన్నికలకు ఈసీ కసరత్తు ప్రారంభం
కేంద్ర ఎన్నికల సంఘం 2014 లోక్ సభ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో 28 రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్, డీజీపీ ప్రసాదరావు భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణ, చేపట్టాల్సిన కార్యచరణ, వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉంది.