: రాజకీయ పార్టీలు కలసి రాకపోతే మేము ఏమి చేయగలం?: అశోక్ బాబు


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఉద్యోగులుగా తాము చేయాల్సిందంతా చేశామని... రాజకీయ పార్టీలు కలసిరాకపోతే తాము ఏమి చేయగలమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రాన్ని కోరే పార్టీలన్నీ రాజ్యసభలో పోరాటం చేయాలని సూచించారు. తనపై కొంతమంది చేస్తున్న విమర్శలను పట్టించుకోనని స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంతంలోని ప్రజలు బీజేపీని నమ్మే స్థితిలో లేరని తెలిపారు. లోక్ సభలో టీబిల్లుపై సవరణల కోసం బీజేపీ పట్టుబట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాజకీయ వ్యవస్థ దిగజారిందనడానికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని చెప్పారు.

  • Loading...

More Telugu News