: సోనియా మాఫియా డాన్: కొణతాల
సోనియా గాంధీ కాంగ్రెస్ మాఫియా డాన్ అని వైఎస్సార్సీపీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా కిరణ్ రాష్ట్ర విభజనకు అన్ని విధాలుగా సహకరించి తెలుగు ప్రజలను మోసం చేశారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.